ఈ మధ్య కాలంలో షోస్ కావొచ్చు ఈవెంట్స్, రియాలిటీ షోస్, మూవీస్, సీరియల్స్ అన్నిటికి ప్రజలు అభిమానులు బాగా ఎడిక్ట్ ఐపోయి అందులో కనిపించేవి నిజంగా క్యారెక్టర్స్ అనుకుని వాళ్ళను తిట్టడం అబ్యూజ్ చేయడం వంటివి చేయడం బాగా ఎక్కువైపోయింది. అంటే సినిమాని సినిమాలా చూడడం లేదు...బిగ్ బాస్ ని కూడా ఒక నార్మల్ షోలా చూడడం లేదు. అదొక ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే అని.. అందులో ఆడేవాళ్లంతా కూడా ఆ కాసేపు అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు అన్నట్టుగా ఎవరూ అనుకోవట్లేదు.
ఇప్పుడు సోనియా ఆకుల విషయంలో కూడా ఇదే జరిగినట్టు అర్ధమవుతోంది..ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ చూస్తే తెలుస్తోంది. "బిగ్ బాస్ ఆడించే గేమ్ లో నా పాత్ర, నీ పాత్ర గురించి...విన్నింగ్ కప్ గురించి ఇంత దిగజారి కామెంట్స్ చేసుకోవడం ఎందుకన్నా ? ఈ మొత్తం బిగ్ బాస్ బిజినెస్ లో మనమంతా చిన్న రోల్స్ ప్లే చేసాం అంతే..రిలాక్స్ గా ఉండండి...బిగ్ బాస్ చూడండి ..ఎంజాయ్ చేయండి" అంటూ ఎవరికో కానీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈ ఫైర్ బ్రాండ్..సోనియా అంటే ఫైర్ బ్రాండ్ లా బిగ్ బాస్ లో పేరు తెచ్చుకుంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసి ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు.జార్జ్ రెడ్డి సినిమాలో హీరో సిస్టర్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో వచ్చిన ఫేమ్‌తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఎన్కౌంటర్ అనే సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఆమె ఆసా అంటే యాక్షన్ ఎయిర్ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. అనాథ పిల్లలకు ఆర్ధిక సాయం, లాక్డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణి వంటివి చేసింది.